Categories: MoviesSouth Cinema

Singer Veeha about Garividi Lakshmi movie

గరివిడి లక్ష్మి చిత్రం గురించి సింగర్ వీహా ఇంటర్వ్యూ

సింగర్ వీహ సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా, తిమ్మారెడ్డి పల్లె, సింగింగ్ పట్ల ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నీహా పలు చిత్రాల్లో ప్లేబ్యాక్ సింగర్ గా రాణించారు, లేటెస్ట్ గా విడుదలైన గరివిడి లక్ష్మి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

“ప్రాణంతో వున్నానని తెలిపే
పరికరమొకటే నాకూ పాట “
కొండకోన పాటలో ఒక గాయనికి పాటతో వుండే అనుంబంధాన్ని తెలిపే లైన్ ఇది గరివిడి లక్ష్మి సినిమా కోసం దర్శకుడు గౌరి నాయుడు సందర్భం చెప్పినప్పుడు ఈ పాట ఉవ్వెత్తున ఎగసి పడింది నాలోనుండి దానికి ప్రేరణ ఆ సందర్భంతో పాటు ఎలాగైనా తన గొంతును వెండితెరపైన వినిపించి తన ముద్ర వేసుకోవాలని మన వీహా చేసే యుద్ధం కూడా పాలమూరు నుండి పాట కోసం వచ్చి
పదేళ్లుగా ఇక్కడెవరూ సపోర్ట్ లేకున్నా తను చేసిన పోరాటం తన ఆరాటం గత మూడేళ్ళుగా గరివిడి లక్ష్మి కోసం దాదాపు 17 పాటలు తానే ట్రాక్స్ పాడి ఏ అర్ధరాత్రి పిలిచినా స్టూడియో కి వచ్చి కష్టపడుతూ తను పాడిన పాటలు తన కళ్ళముందే అనన్య భట్ పాడుతుంటే విశాల హృదయంతో తనకు సహకరించి ప్రతి పాట బాగా రావడానికి సహకరించడం
క్లైమాక్సు ఎమోషనల్ సాంగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చిత్రమ్మతో పాడించాలని మేం అనుకున్నా
తన కష్టానికి చేసిన యుద్ధానికి ఫలితంగా ఉలుకు పలుకు,నీ నీడ లాంటి సినిమాకు ఊపిరి పోసి చిరస్థాయిగా నిలిచిపోయే రెండు పాటలు రికార్డింగ్ నుండి డైరెక్టర్ షూటింగ్ దశ నుండి సినిమా టీమ్
ఫైనల్ స్టేజి లో కళాకారుల ఆరాటం తెలిసిన గౌరీ నాయుడు నిర్మాత క్రితి, విశ్వ ప్రసాద్ గారు అంతా తన గొంతే ఫైనల్ చేసి ఈరోజు థియేటర్ లో ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యేలా చేసిన పాట ఇది.

 

ఎంతమంది విన్నారో విన్నవాళ్ళకు పాడింది వీహా అనే ఒక వర్ధమాన గాయిని అని తెలిసో లేదో తెలియదు గాని ఈ సినిమా గురించి వచ్చే ప్రతి ప్రశంసలో
క్లైమాక్సు సాంగ్ అండ్ గాయని ప్రస్తావన లేకుండా ఎవరూచెప్పలేదు చిత్ర గారు పాడిన పాటలు అద్భుతం అనే అంటున్నారు చాలామంది దీనికి సుద్దాల గారి సాహిత్యం కూడా అంత విలువను తీసుకువచ్చింది. అతియోశక్తి అనుకోకపోతే చిత్రమ్మ పాడాల్సిన స్థాయి పాటల్ని పాడి మెప్పించి అందరితో వీహమ్మ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిన
మన వీహాకు కూడా గరివిడి లక్ష్మితో ఘన శకం మొదలైనట్టే మనసు పెట్టి వినండి మీరు కూడా ఇదే మాట అంటారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share